లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్… ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, సడలింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత లాక్‌డౌన్ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పొడిగించారు.. ఇదే సమయంలో.. సడలింపులు సమయాన్ని పెంచుతూ.. లాక్‌డౌన్ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఉంటాయి.. ఇక, ఇంటికి చేరుకోవడానికి అదనంగా మరో గంట అంటే సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమల్లో ఉండనుండా.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.. నకిరేకల్ మినహా మిగతా నల్గొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్ స్థితి కొనసాగుతుందని ప్రకటించింది సర్కార్.