హైదరాబాద్‌లో ఓ బాలిక, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట.. ఇవాళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంటలో శవాలుగా తేలారు.. నీటిపై తేలుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.. అయితే, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17), విషాల్ (21) అనే జంట.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని…
తెలంగాణలో ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,823 కి చేరింది. ఇందులో 4,74,899 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 50,969 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 27 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో…
కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కి వినతిపత్రం సమర్పించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. అందులో ”కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు మరణిస్తే సర్కార్‌ది బాధ్యత కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108…
మామూలు రోజుల్లో ఆదివారం వస్తే ఉదయం మధ్యాహ్నం వరకు నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రద్దీ కనిపిస్తుంది. కానీ, ఇది కరోనా కాలం. నిబంధనలు అమలౌతున్న రోజులు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉన్నది. దీంతో ఉదయం 6 గంటల నుంచి నాన్ వెజ్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది…
ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ఈ లేఖలో కోరారు సీఎం జగన్. అంతేకాదు ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని..…
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా…
సిఎం కెసిఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చురకలు అంటించారు. తన ఉనికిని దెబ్బ తీసేందుకు కెసిఆర్ సర్కార్ చాలా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని…తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని గంగుల కమలాకర్ రావును టార్గెట్ చేశారు ఈటల. ఎన్ని కుట్రలు చేసినా..…
ఎపి నుంచి వచ్చే ఆంబులెన్సును తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టులో ఆపడం తీవ్ర ఆందోళన ఆవేదనకు దారితీసింది. కరోనాచికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్‌కు మరో మూడేళ్లు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఈ ఘటను కలకలం రేపుతున్నా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన లేకపోయింది. తెలంగాణ హైకోర్టు తనకు తానుగా దీనిపై ఆగ్రహం వెలిబుచ్చి ఆపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా తెలంగాణ వైఖరి మారకపోవడం,…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 525007 కి చేరింది. ఇందులో 469007 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 53072 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 32 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…