గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈటల రాజేందర్ విషయం హల చల్ గా మారింది. తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల అక్కడ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను మోసం చేసిన వ్యక్తిగా ఈటల నిలిచి పోతారు అని తెలిపారు. తెలంగాణ ప్రజల ను మోసం చేసిన వ్యక్తిగా ఈటల కు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని స్పష్టం చేసారు. మంత్రి గా కోట్లాది రూపాయలు కూడగట్టి అక్రమాలు చేశారు. ఈ సమావేశం అనంతరం ఈటల వెంట పార్టీ మారుతున్నట్టు కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవ రెడ్డి ప్రకటించారు.