వరంగల్ అర్బన్ ఇక హన్మకొండ జిల్లా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించారు.. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అంటూ.. ఒకే పేరుతో రెండు జిల్లాలు ఉన్నాయి.. అయితే, వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా.. వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లాగా మార్చనున్నట్టు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడతాయని తెలిపారు.. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. హన్మకొండలో కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. వరంగల్ చరిత్రను.. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్రను గుర్తుచేవారు.. వరంగల్ వైభవం చాటిచెప్పేలా కలెక్టరేట్ నిర్మించారని కితాబిచ్చారు. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకం. ప్రజలు తమ పనుల కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.. ఇక, రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాలన్న ఆయన.. వరంగల్ సిటీలో డెంటల్ ఆస్పత్రి, కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందని అన్నారు. ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని చెప్పారు. రేపు రేపు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చే పరిస్థితి రావాలన్నారు. ఇక, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…
Also Read
తాజావార్తలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!