కేసీఆర్‌వి కొత్త అబద్ధాలు… తుగ్లక్ వాగ్దానాలు : రాములమ్మ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సెటైర్ వేశారు. అచ్చమైన తెలంగాణ భాషలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు. వీటిలో ఏ ఒక్కటీ ఇంతకుముందు జరగలేదు. ధనిక రాష్ట్రం అని చెప్తున్న ఈ సీఎం గారు, మరి పైసలున్నప్పుడు గవన్నీ ఎందుకు చెయ్యలేదు? కేవలం చేసేది ఇష్టం లేకనా… కాదంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నట్లా? వరంగల్ ఐటీ హబ్ అన్నరు… డబుల్ బెడ్రూం ఇళ్ళన్నరు… కుర్చీ వేసుకు కూర్చుని పూర్తి చేసి కల్లు తాగి దావత్ చేసుకుంటానన్నరు… ఇవన్నీ ఏమైనవో తెల్వదు. ఇప్పుడు మల్లా తుగ్లక్ తీరున ఈ వాగ్దానాలు. తెలంగాణ ప్రజలు అమాయకులనా… లేక ఈ సీఎం గారి మానసిక పరిస్థితి సరిలేక ఇదంతా జరుగుతున్నదా?.. అని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. అసలు అమలు కాని, అమలు చెయ్యని ఇలాంటి అవకతవక, అనాలోచిత హామీలు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు జిల్లాలు పర్యటించుడు… వారి ఆలోచన సమతుల్యతను సందేహించా ల్సినట్లుందనే అభిప్రాయాలు తెలంగాణ సమాజంలో బలపడుతున్నాయి.” అంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు.
read also : యదాద్రి పనులపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు…
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Tags
- cm kcr
- telangana
- TRS
- vijayashanthi
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!