ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతున్నా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదు. విభజన హామీలను కేంద్రం లోని బీజేపీ ని అడిగే ధైర్యం కేసీఆర్ కు లేదు. కోవిడ్ విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయి. మెడికల్…
2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ సాధన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నది. 2018 వ సంవత్సరంలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మరింత అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. 1969 లో తెలంగాణకోసం ఉమ్మడి…
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలోకి రావాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డ్ తప్పని సరి చేశారు. ఆనందయ్య మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తప్ప మరెవరూ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదని, గ్రామస్తుకు కూడా బయట నుంచి గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు తప్పని సరి అని పోలీసులు చెబుతున్నారు. కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. గ్రామస్తులు తప్ప ఇతరులను గ్రామంలోకి…
ప్రేమించిన అమ్మాయి కోసం తెలుగు యువకుడు దేశాలు దాటి వెళ్లేందుకు కాలి నడకన బయలుదేరి దాయాది దేశం సైనికులకు దొరికిపోయాడు. 2017 నుంచి పాక్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఇటీవల రిలీజ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నాడు. పాక్ చెర నుంచి క్షేమంగా బయటపడిన ప్రశాంత్ పాక్ జైలు గురించి కీలక విషయాలను తెలియజేశాడు. విచారణ సమయంలో తనను తీవ్రంగా కొట్టారని, ఏడారి ప్రాంతంలో సైనికులకు దొరికిన సమయంలో తనకు మంచి ఆహారం అందించారని ప్రశాంత్…
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నేడు వైఎస్ షర్మిల పర్యటించనుంది. వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రాజు, మురళీల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వెల్దుర్తిలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలతో ఉదయం 7 గంటలకే వెల్దుర్తి రానుంది. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు పూర్తచేశారు. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల…
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాఢంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా వేడుకలను సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత బయటకు ఎవరూ రాకూడదు అనే సంగతి తెలిసిందే. దీంతో ఉదయం సమయంలోనే వేడుకలను సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ వేడుకలు జరిగినా 10 మందికి మించకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్పై 26 పైసలు, లీటర్ డీజిల్పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. కాగా తెలంగాణలో పెట్రోల్ సెంచరీ దాటింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ…
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాల తో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం,…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 3,308 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,80,844కు పెరిగాయి. 5,44,294 మంది రికవరీ…
వర్షాల సీజన్ ప్రారంభమైనందున తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని.. అవసరం అయితే, ధాన్యం తరలించడానికి ఇసుక లారీలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను సూచించారు మంత్రి హరీష్రావు.. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు పద్ధతిలో సాగుచేస్తున్న రైతులు పొలాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా అధికారులు పని చేయాలన్నారు.. సీఎం కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి…