పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వర్చువల్ గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ ఫంక్షనల్ వర్టీకల్స్ అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డి.జి.పి మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. నేరాల నియంత్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తూ నిందితుల అరెస్ట్, న్యాయస్థానాల ద్వారా అలాంటి వారికి శిక్షలు పడే విధంగా చేయడం ద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంచడం, ప్రజా మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా సమర్ధవంతంగా పని చేస్తున్నామని డిజిపి తెలిపారు. రానున్న రోజులలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా, కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తదనంతర పరిమాణాలలో పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని ఈ సందర్భంగా డి.జి.పి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి తెలిపారు.
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!