రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోనున్నాయి. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో ప్రభుత్వం వెబ్ సైట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్ సైట్లకు అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వుల జారీ నిలిచిపోనుంది. read also : కరీంనగర్ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు ! అంటే.. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ…
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల, ఇవాళ తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల… తల్లి విజయమ్మతో కలిసి ఈరోజు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. సాయంత్రం పార్టీ జెండా, ఎజెండా ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ తనయ షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు. read also : వాహనదారులకు షాక్.. మరోసారి…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు…
కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ అందుకున్న జి కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.. నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తానన్న ఆయన.. నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను.. వారికి కృతజ్ఞుడనై ఉంటానని..బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర…
ఆ జిల్లాలో ఆయన చెప్పినట్టు చేయకపోతే అంతేనట. ప్రజాప్రతినిధులతో పొసగకపోతే.. ఎంతటి వారికైనా పొగపెట్టేస్తారట. ఆ ఆస్పత్రి డైరెక్టర్ విషయంలో అదే జరిగిందని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. సమస్య ముదిరి డైరెక్టర్ కుర్చీ కదిలింది! ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉంటోంది. డైరెక్టర్‌గా ఉన్న బలరాం నాయక్‌ను మార్చి కొత్తగా డాక్టర్ కరుణాకర్‌ను వేయడంతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. ముక్కుసూటిగా ఉండటం వల్లే…
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు…
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,141 సాంపిల్స్ పరీక్షించగా.. 772 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 748 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,054కు చేరగా.. రికవరీ కేసులు 6,13,872 కు…
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ లకు కేంద్రం అండగా నిలవాలి అని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు అందించాల్సిన సహాయక చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు విజ్ఞప్తి చేశారు.…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి…