తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హైదరాబాద్ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. విధి విధానాలు ప్రకటించారు. అక్కడే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమమే.. తమ పార్టీ సిద్ధంతామన్నారు షర్మిల. రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం…
హైదరాబాద్ లో ఉగ్రవాదులు పట్టుబడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం రహిత హైద్రాబాద్ కోసం బీజేపీ కి ఓటు వేయాలని అంటే మతతత్వ పార్టీ అన్నారు. ఇప్పుడు నగరం సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎవరి ప్రయోజనాల కోసం హోం మినిస్టర్ ఏం చేస్తున్నాడు. రోహింగ్యాలను తరిమి కొట్టడం మతతత్వం అయితే బీజేపీ మతతత్వ పార్టీ నే అన్నారు. బీజేపీ ఎప్పుడు ఇస్లాం, క్రీస్తవాన్ని విమర్శించలేదు. 48…
మంత్రి ఎర్రబెల్లితో వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశానని అన్నారు ఎల్ రమణ. సామాజిక తెలంగాణ కోసం కృషిచేయాలని కేసీఆర్‌కు చెప్పాన్నారు. తనతో కలిసి రావాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు ఎల్ రమణ. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. తన నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం కేసీఆర్‌కు తెలిపారని అన్నారు ఎల్ రమణ. కాగా, ఇప్పటికే ఎర్రబెల్లితోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు ఎల్. రమణ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ కష్టమని…
కళాశాలలను తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఈ కరోనా సమయంలో పర్మిషన్ లేకున్నా కొన్ని కళాశాలలు ఇంటర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. అనుమతి లేని బిల్డింగ్స్ లో కళాశాలలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫీజులు ఇస్టమొచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్స్, ఫీ విషయం లో బోర్డ్ ఆదేశాలను పాటించాలి అని తెలిపింది. పిజికల్ తరగతులు నిర్వహించకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయి. అలాగే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తాం అని పేర్కొంది. ఈ మేరకు ఓ…
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలడం ఖాయం అయిపోయింది. గతంలోనే టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారంటూ జోరుగా ప్రచారం సాగినా.. ఆయన ఆ వార్తలను ఖండించారు.. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం.. రమణ.. కారు ఎక్కడమే మిగిలిందంటున్నారు.. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ.. ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు ఎల్ రమణ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయన.. కేసీఆర్‌తో చర్చలు జరిపారు.. ఇక,…
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 731కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,29,785 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 11,206 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.. నదీ జలాల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. కృష్ణా నది మీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అంటూ ఫైర్ అయ్యారు.. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు.. కలిసి భోజనాలు చేయొచ్చు.. స్వీట్లు తినినిపించుకోవచ్చు… కానీ, రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా?…
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇప్పటికే ఎంతో మందికి నేనున్నానంటూ సాయాన్ని అందించిన ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య రెడ్డి.. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ.. ఆర్థిక ఇబ్బందులతో గత నవంబర్‌లో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నారు.. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఫీజులు…
ఆస్తుల కోసం పోరాటం కాదు… హక్కు కోసం పోరాడుతున్నామని.. ఆట ఇప్పుడే మొదలైందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. గర్భవతిని కాబట్టే ఇంతకాలం బయటికి రాలేదు… డాక్టర్ సలహా మేరకే ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నా.. భూమా నాగిరెడ్డి ఆస్తులు, అభిమానులు, కార్యకర్తలతోపాటు శత్రువులను కూడా వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుందన్నారు.. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొండి.. కానీ, తప్పుడు కేసులతో పోలీసులను…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ విజయమ్మ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాక ముందు తెలంగాణలో రక్తం మరకలు ఉంటే… వైఎస్ వచ్చాక ఆ భూముల్లో నీళ్లు పారాయన్న ఆమె.. తుపాకుల చప్పుళ్లు తగ్గాయన్నారు.. మీ కుటుంబ సభ్యురాలుగా నా బిడ్డను చేర్చుచుకోండి అని కోరిన ఆమె.. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని.. తెలుగు రాష్ట్రాలు ఒక్కటే.. రాష్ట్రాల మధ్య అభిప్రాయ బేధాలు రావొచ్చు.. కానీ,…