నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానున్నది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్దం చేసింది కమిషన్. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు జస్టిస్ చంద్ర ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు కమిషన్…
యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మీటింగ్ అనంతరం చాపర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్. సీఎం టూర్ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్ లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్…
TG Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ సుమారు ఐదు గంటల పాటు సాగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ (డియర్నెస్ అలౌయెన్స్) ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ…
నాన్న దేవుడు... ఆయన చుట్టూనే దయ్యాలు చేరాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్..... అలాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీస్లు ఇస్తుందా? హవ్వ... ఎంత ధైర్యం? మా నాయకుడికి నోటీస్లు ఇస్తే... పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నిరసన తెలపకపోవడానికి రీజనేంటి? బీఆర్ఎమ్మెల్సీ కవిత లేటెస్ట్ మాటలివి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం.... కేసీఆర్కు నోటీస్లు ఇస్తారా అంటూ... ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న కవిత... అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేశారు.
తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... అధికారం మాదేనంటూ ఢంకా బజాయిస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. పవర్లోకి వస్తామన్న నమ్మకం ఉండటం ఏ పార్టీకైనా మంచిదే. కానీ... పనేమీ చేయకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది.