ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ అంతకంతకు పెరుగుతోందట. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతోందంటున్నారు. జిల్లాలో పార్టీకి అయ్యా అవ్వా లేరంటూ ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మరో మాజీ మంత్రి సైతం అధికార పార్టీలో ఉండి అధికారులపైనే విమర్శలు చేశారు. ముఖ్యంగా... సిర్పూర్, ముథోల్ ,మంచిర్యాల నియోజకవర్గాల్లో గ్రూప్ లొల్లి తారా స్థాయికి చేరిందట.
హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీ పై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు.. చేప ప్రసాదం కోసం ఫిషరీస్ కార్పొరేషన్ 1.5 లక్షల…
Konda Vishweshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన లేఖ రాజకీయ డ్రామా మాత్రమేనని, దీని వెనుక అసలు స్కెచ్‌ను మాజీ సీఎం కేసీఆరే తయారుచేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఈ డ్రామా ద్వారా కవిత మీడియా దృష్టిని ఆకర్షించగలిగిందని, హెడ్లైన్లలో నిలవడమే లక్ష్యంగా ఇది సాగించబడిందని వ్యాఖ్యానించారు. “కవిత తన ఉద్దేశాన్ని సాధించగలిగింది. బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుండటంతో దృష్టి మళ్లించేందుకు…
TG Cabinet : రాష్ట్రంలో కొనసాగుతోన్న తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జూన్ 5న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు వేదికకానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ…
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో…
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. ఇంతకీ ఈ యువ ఎమ్మెల్యేకి ఏం కష్టమొచ్చింది. కన్నీరు పెట్టడానికి గల కారణం ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో యశస్విని రెడ్డి పాల్గొన్నది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. Also…