ఆత్మహత్య లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హుస్సేన్ సాగర్. నిన్ను ఒక్కరోజే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఐదుగురు మహిళలు. అయితే ఆ ఐదుగురిని లేక్ పోలీసులు కాపాడారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో గొడవలు, ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్యా యత్నంకి పాల్పడ్డారు మహిళలు. కానీ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కు అప్పగించారు పోలీసులు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 285 మందిని కాపాడిన లేక్ పోలీస్ లు కోవిడ్ తరువాత ఆత్మహత్యలు పెరిగాయంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య లు చేసుకోవడానికి వస్తున్నారంటున్న లేక్ పోలీసులు కోవిడ్, లాక్ డౌన్ సమయంలో వంద మందిని రక్షించారు.