తెలంగాణ మైనార్టీలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ‘మైనారిటీ గర్జన సభ’ లో ఆ పార్టీ నాయకురాలు గీతా రెడ్డి కామెంట్స్ చేశారు. మోదీ పెద్ద ఫేక్.. కేసీఆర్ అంత కంటే పెద్ద ఫేక్ అని ఆమె విమర్శలు చేశారు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మైనార్టీ మీటింగ్ చూస్తున్నాను. 45 లక్షల మందికి పైగా… ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రజల మైండ్ సెట్ మారాలి.. మార్పు తీసుకురావాలి అని ఆమె కోరారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన 4 శాతమే ఇప్పటికీ ఉంది.. 12 శాతం అని చెప్పి కేసీఆర్ దొంగమాటలు చెప్పాడని కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి ఆరోపించారు.