తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు పోటేత్తింది. ఒకవైపు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద, మరోవైపు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరికొన్ని రోజులు వర్షాలు…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 87,521 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 847.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 74.9770 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను అంటే నేను…
నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి భారీగా చేపలు వచ్చాయి. దీంతో పలువురు స్థానికులు రోడ్లపై చేపలు పట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మల్ వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి…
జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న…
రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షానికి పలు చోట్ల రహదారులు దెబ్బతినగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇక…
విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్‌లర్లే బాస్‌లు. నిధులు.. నియామకాల విషయంలో వారి నిర్ణయమే ఫైనల్. కానీ.. మారిన పరిణామాలతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని రగిలిపోతున్నారట వీసీలు. హక్కులను కాపాడుకునే విషయంలో ఇంకేదో చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో వీసీలకు వచ్చిన ఇబ్బందేంటి? కామన్ రిక్రూట్మెంట్పై ఆలోచనలో పడ్డ వీసీలు! చాలాకాలం తర్వాత తెలంగాణలో పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు వచ్చారు. ఉప కులపతులు రాకతో.. ఆయా వర్సిటీలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీల నియామకాల ప్రక్రియ మొదలవుతుందని…
గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అన్నారు. అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. Read: గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ? ఎస్సారెస్సీకి వరద ఉదృతి…
దేశంలోని అన్నిరాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌కి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీని నిర్వహించి రాజ్‌భవన్ ముందు ఆందోళన నిర్వహించి గవర్నర్‌కు వినతి పత్రం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్నారు. వర్షాన్నిసైతం లేక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని…
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో జోరుగా వానలు పడుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. అలాగే అతిభారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది ఐఎండీ. read also : జులై 13, మంగళవారం దినఫలాలు దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగాలు సిద్ధంగా…