ఇవాళే టీఆర్ఎస్లో చేరిన కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన హుజురాబాద్ అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి.. ఇవాళ తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. కౌశిక్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీర్.. అయితే, తన చేరిక సందర్భంగా.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి..…
తెలంగాణ పెరిగిన భూముల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్ లు చేసింది. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200 లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం,…
మాజీ మంత్రిఈటెల రాజేందర్ బిజెపిలో చేరిక తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజేందర్‌పై సానుభూతి టిఆర్ఎస్ అధికార బలం మధ్యనే పోటీ అనుకున్నది కాస్తా రకరకాల మలుపులు తిరుగుతున్నది. ఆరుమాసాల్లో ఉప ఎన్నిక జరపాలనే నిబంధన వున్నా కోవిడ్ నేపథ్యంలోఅదే సందేహంలో పడిరది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చడం, బెంగాల్ ముఖ్యమంత్రి మమత మరోచోట పోటీ చేసి గెలిచే అవకాశంపైనా అనుమానాలు హుజూరాబాద్నూ సందేహంలో నెట్టాయి. ఈటెల రాజేందర్‌పై సానుభూతి ప్రధానంగా పోటీ జరుగుతుందన్న…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 691 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఐదుగురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, కరోనా రికవరీ కేసులు తగ్గుముఖం పట్టాయి… 24 గంటల్లో 565 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721కు చేరుకోగా… పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 6,25,042కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో…
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలలో విశ్వాసం పోయిందన్న ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారన్నారు.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరుగుతుందన్న రేవంత్… సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం త్వరలో తిరస్కరిస్తుంది.. మేధావులు, మీడియా దీన్ని గమనించాలని సూచించారు.. ఇక, రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి…
హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ స్కీమ్ పెడితే తప్పేముంది.. స్కీమ్ ద్వారా రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది ? టీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో.. కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వలస కాలనీ అవుతాదా అనే ఆవేదన ఉండేది.. పిడికడు మందితో ఉద్యమం స్టార్ట్ చేశాం.. తెలంగాణ ఆకాంక్ష 2014…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… షర్మిల దీక్షపై స్పందించిన ఆయన.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయడం అర్ధ రహితం అన్నారు.. మీ నాన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. తన రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించులేక నిరుద్యోగ దీక్షలు చేపట్టారంటూ సెటైర్లు వేశారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం…
హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా సమయం వున్నా ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమములో ఈటలకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. ఈటల తమ గ్రామములో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ…
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని త్రీటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కరీంనగర్ మున్సిఫ్ కోర్టు.. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా… ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు మున్సిఫ్ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు ఇచ్చారు. కాగా,…
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయు. మొదటి విడతలో గొర్ల కాపర్లకు రూ. 5 వేల కోట్లతో 3లక్షల 71 వేల మందికి గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అని టీఆర్ఎస్, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో డీడీలు కట్టిన…