తెలంగాణ రోజువారి పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 623 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 594 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,229కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 6,34,612కు చేరింది… మరోవైపు.. రాష్ట్రంలో…
ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో జరిగే సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు మాజీ ఐఏఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ నెల 8న ఆయన బీఎస్పీలో చేరనున్న సందర్భంగా నార్కట్ పల్లి మండలంలో ముఖ్యకార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో జరిగే సభతో చరిత్ర సృష్టించబోతున్నాం.. కుమారి మాయావతిని భారత ప్రధానిగా చేయడానికి నల్గొండలో జరిగే బహిరంగ సభ కీలకం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బహుజనుకి రాజ్యాధికారం…
ప్రపంచంలో ఉన్న టాప్ బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి.. మూడు వేల యాక్టివ్ వైఫై హాట్ స్పాట్స్ హైదరాబాద్‌ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చడానికి పనిచేస్తున్నాయని తెలిపారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం ప్రారంభించిన హై-ఫై ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లో 3000కు పైగా పబ్లిక్ వై-ఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఫైబర్ నెట్‌తో ప్రజలు స్పీడ్ ఇంటర్నెట్ పొందుతున్నారు.. ఫైబర్ నెట్‌తో ప్రభుత్వం భాగస్వామ్యం…
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమనిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదన్న హైకోర్టు… అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయన్న హైకోర్టు… రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటని కాగితాల్లో నిబంధనలు బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు నివేదించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల…
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత.…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…
ఇండియాలోనే అతిపెద్ద ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్వర్క్ గా హైదరాబాద్ ఉంది. లార్జెస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. హై ఫై ప్రోగ్రాంలో భాగంగా ఆక్ట్ ఫైబర్ నెట్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఫ్రీ వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హై ఫై ప్రోగ్రాం కామెమోరేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, IT ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆక్ట్ ఫైబర్ నెట్ సీఈఓ బాల మల్లాది, GHMC మేయర్ విజయలక్ష్మి…
ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న లేఖపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు విచారణకు కోరారు. సుమారు 3వేల గజాలకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపిన ఏజీ… తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని తెలిపారు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు అదహేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ, అంబర్…
తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు… సుమారు 3 గంటలపాటు ఆయన పర్యటన కొనసాగింది.. దళిత కుటుంబాల మహిళలు కేసీఆర్‌కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం…