టీఆర్ఎస్ 60 లక్షల మంది కార్యకర్తలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది అని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ , వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ కార్యకర్తల సంక్షేమ కోసం బీమా కల్పించారు. ఇందుకోసం18.37 కోట్ల రూపాయల బీమా ప్రీమియం చెల్లించారు. అన్ని రాష్ట్రాల తరవాత ఆఖరులో ఏర్పడ్డ మన తెలంగాణ అతి తక్కువ కాలం ఏడేళ్ల లోనే దేశం గర్వించే అభివృద్ధి చెందింది. 70 ఏళ్లలో సాధ్యం కాని మిషన్ భగీరథను ఏడేళ్ళ లో సుసాధ్యం చేశారు అని తెలిపారు. ఇంత అద్భుత పాలన చేస్తున్న నాయకుడిని కొంతమంది విమర్శిస్తున్నారు. ఉద్యమంలో ఎక్కడా లేని వారు నేడు కేసీఆర్ ని విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీకి ఎన్నికలే కొలమానం. త్వరలో వారికి ప్రజలే బుద్ది చెప్తారు అని పేర్కొన్నారు. అర్హత తెలుసుకునీ మాట్లాడే బుద్ది వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సీఎం కేసీఆర్ అమితమైన భక్తితో యాదాద్రి అద్భుత అభివృద్ధి చేశారు. భద్రాద్రి అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు మంత్రి.