ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గంలో దూకుడు పెంచారా? వచ్చే ఎన్నికలకు ఇప్పుటి నుంచే వర్కవుట్ చేస్తున్నారా? సెంటిమెంట్‌ను రగిలించడంతోపాటు.. వారసులకు రాజకీయంగా తగిన ఉపాధి చూపించే పనిలో పడ్డారా? సీటు ఖాళీలేని చోట ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి? ఎవరా మాజీ మంత్రి? తాండూరు టికెట్ తనదే అని పట్నం ప్రచారం! పట్నం మహేందర్‌రెడ్డి. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్సీ. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి.. 2018 ముందస్తు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రధాని మోడీతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇక ప్రధాని మోడికి 10 అంశాలతో కూడిన వినతులను అందజేశారు. తెలంగాణలో ఐసీఎస్‌ల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 139 నుంచి 195 కి పెంచాలని కోరారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ…
సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావన్నది పొలిటికల్ సర్కిల్స్ లో తరచూ వినిపించే మాట… ప్రత్యర్థులు వాటిని అర్థం చేసుకునే లోపే ఆయన తన పని చక్కబెట్టుకోగల నేర్పరి. ఎంతో ముందుచూపుతో ఆయన వ్యూహాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా తనకు ఏమాత్రం ఫరక్ రాకుండా చూసుకోవడం కేసీఆర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. తెలంగాణ ప్రజలందరీలో ఉద్యమ…
వీసీ సజ్జనార్. అది పేరు కాదు. బ్రాండ్. మహిళలను వేధించే వారి ప్రాణం తీసే బ్యాండ్. పోలీస్ పవర్ కు ఆ పేరు కేరాఫ్. నేషనల్ లెవల్లో కాదు.. ఇంటర్నేషనల్ లెవల్లో రాష్ట్ర పోలీసుల ప్రతాపాన్ని మార్మోగించిన వ్యక్తి ఆయన. ఇంతటి పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. కీలక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించిన పేరున్న అధికారి.. ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి బాస్ అయ్యారు. ఎండీగా ఇవాళే బాధ్యతలు తీసుకున్నారు. పోలీస్ అధికారిగా దూకుడుగా పని చేసిన ఆయన.. ఇప్పుడు…
ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీపీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో శుక్రవారం సజ్జనార్ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకు ముందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009 లో దేశం లోనే సంచలనం…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,58,689కి చేరింది. ఇందులో 6,49,002 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,809 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3,878 కి చేరింది. ఇక తెలంగాణలో వేగంగా…