హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ బీజేపీ నేతలకు మిస్టరీగా మారిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ బీజేపీ నేతలకు ఒక మిస్టరీగా మారిందా? అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుంది అని ఎదురు చూడటమే సరిపోతోందా? ఆశ.. నిరాశల మధ్య కమలనాథులు కాలం వెళ్లదీస్తున్నారా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఉపఎన్నిక ఎప్పుడో క్లారిటీ లేదు..!
Also Read
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హజురాబాద్‌లో.. ఉపఎన్నిక షెడ్యూల్ పార్టీలను ఊరిస్తోంది తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన మాత్రం రావడం లేదు. టీఆర్ఎస్, బీజేపీలు అక్కడే మోహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొత్త పథకాలు పుట్టుకొస్తున్నాయి.. డబ్బులు నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. ఉపఎన్నిక ఎప్పుడో మాత్రం క్లారిటీ లేదు.
బీజేపీ నేతలు ఆశించిదొక్కటి.. అయ్యిందొక్కటి..!
ఈటల బీజేపీలో చేరుతున్న సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉపఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించేలా చూస్తామని ఢిల్లీ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. అప్పటి నుంచి అదిగో షెడ్యూల్.. ఇదిగో షెడ్యూల్ వచ్చేస్తోందని ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అసెంబ్లీకి ఎన్నిక కాకుండా ఉండేందుకు ఇక్కడ ఉపఎన్నిక ఆలస్యం చేస్తారని అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలు తప్పయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఉపఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. హుజురాబాద్‌ను పక్కన పెట్టేసింది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఆశించిందొక్కటి.. అయ్యిందొక్కటి.
ఢిల్లీ పెద్దలతో మాట్లాడాక మళ్లీ ఆశ..!
ప్రస్తుతం బీజేపీ నేతలను ఎవరిని కదిపినా.. అదేంటి అలా జరిగిందని ప్రశ్నించినా.. నోటి మాట రావడం లేదు. వారి దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదట. ప్రైవేట్ సంభాషణల్లో మాత్రం ఇలా ఎందుకయ్యిందబ్బా అని చర్చించుకుంటున్నారట. కొందరైతే తమకున్న పరిచయాల ద్వారా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారట. ఆ తర్వాత ఉపఎన్నిక షెడ్యూల్‌పై మళ్లీ ఆశలు చిగురించినట్టు టాక్.
సెప్టెంబర్ 17కు ముందే షెడ్యూల్ వచ్చేస్తుందని ఆశించారట!
జోగిపేటలో ఇటీవల బీజేపీ పదాధికారులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆ భేటీలో హుజురాబాద్ ఉపఎన్నికపై చర్చించారు. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేస్తుందని చెప్పారట ఆ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేతలు. వారి మాటల ప్రకారం సెప్టెంబర్ 17కు ముందే ఆ షెడ్యూల్ ఏదో వచ్చేయాలి. అదే జరిగితే నిర్మల్‌లో నిర్వహించిన అమిత్ షా బహిరంగ సభను హుజురాబాద్‌లో పెట్టాలని అనుకున్నారట. అంతేకాదు సంజయ్ సంగ్రామ యాత్రకు బ్రేక్ వేసి.. యాత్రలో ఉన్న నాయకులంతా హుజురాబాద్‌కు మకాం మార్చుకోవాలని డిసైడ్ అయ్యారట.
శనివారాలు.. మంగళవారాలు వెళ్లిపోతున్నాయి..!
సెప్టెంబర్ 17 వెళ్లిపోయింది. నిర్మల్‌లో అమిత్ షా సభ కూడా జరిగిపోయింది. సంజయ్ సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ మాత్రం రాలేదు. చివరగా కిందటి శనివారం షెడ్యూల్ వచ్చేస్తుందని అనుకున్నారట. అది మిస్ అయితే మంగళవారం కన్ఫామ్ అని భావించారట. ఇప్పుడు శనివారం పోయింది.. మంగళవారం వెళ్లిపోయింది. హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎక్కడంటే అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు దసరా ముందు ఎన్నిక జరిగే అవకాశాల్లేవ్. రోజులు లెక్కపెట్టుకోవడమే తప్ప ఊరట లేదు. దీంతో ఆశ.. నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారట కమలనాథుల. మరి.. వారిని సంతోష పరిచే మాట ఎప్పుడొస్తుందో ఏమో?
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!