కేటీఆర్‌ను బొక్కలో వేయిస్తాం.. శివాజిలా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులుచెరుగుతున్నారు.. ఇవాళ ఇల్లంతకుంట బహిరంగ సభలో.. మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను బొక్కలో వేయిస్తాం అంటూ హెచ్చరించిన బండి సంజయ్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆరే కారణం అని ఆరోపించారు. ఇక, ధాన్యం కొనుగోలులో కేసీఆర్ బ్రోకర్ మాత్రమే.. కేంద్రమే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని కామెంట్ చేసిన ఆయన.. పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దళిత బంధు స్కీం కొత్తది కాదు.. ప్రధాని మోడీ ఏనాడో ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. మరోవైపు.. అంబేద్కర్ గురించి మాట్లాడని సీఎం కేసీఆర్.. అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రాంతాలను పంచ తీర్థాలుగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందన్నారు.
దళితున్ని రాష్ట్రపతిని చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని.. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ప్రభుత్వం కూడా తమదేనన్నారు బండి సంజయ్.. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల లాగా.. రాజాకార్ల లాగా యుద్ధానికి వస్తే నేను శివాజిలాగా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తానని వ్యాఖ్యానించారు బండి సంజయ్.. తెరాసా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. విద్యా వాలంటీర్లను తొలగించిందని మండిపడ్డ ఆయన.. తల్లిదండ్రుల మెడలో నుంచి పుస్తెలు అమ్ముకొని తమ పిల్లల్ని చదివిస్తే ఒక వ్యక్తికి కూడా ఉద్యోగం ఇవ్వని ప్రభుత్వం ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం కేసీఆర్‌దే అని విమర్శించిన బండి.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు.. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మబలిదానాలు చేస్తే , కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని.. హైదరాబాద్ లో వరదలు వస్తే కనీసం సీఎం చూడడానికి కూడా రాలేదన్నారు.. ఇక, హిందూ ధర్మం కోసం ఏడు సార్లు జైలుకు వెళ్లి వచ్చాను.. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర నా యాత్ర మొదలు పెట్టా.. నాకు భయం లేదన్న బండి సంజయ్.. ఎంఐఎం పార్టీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.. ఎంఐఎం పార్టీ వారు మోడీని ఓల్డ్ సిటీలో అడుగుపెట్టనివ్వం అంటున్నారు.. మోడీ దాకా ఎందుకు మీ బతుకులకు బీజేపీ కార్యకర్త చాలు అని నేను అంటున్నానని.. రాబోయేది పేదల ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..