దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు.…
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్లో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా? సీనియర్లు వేసిన స్కెచ్‌కి.. పార్టీ ఇంఛార్జ్ చెక్ పెట్టారా? దళిత దండోరా సభకు రాహుల్ వస్తా అన్నా.. వద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? లెట్స్ వాచ్! రాహుల్‌తో వన్ టు వన్ భేటీ లేకపోవడంతో నేతలు ఉస్సూరు! తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చాలారోజుల తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కింది. 45 నిమిషాలపాటు పీసీసీ కొత్త టీమ్ సమావేశమైంది. సీనియర్ నాయకులతో…
దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పటికే తాను దత్తత తీసుకున్న వాసాలమర్రిలో అమలు చేశారు.. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.. ఇక, మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అంటే.. నాలుగో నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని సోమవారం…
రాజకీయంగా టీఆర్ఎస్కు కీలకమైన గ్రేటర్ హైదరాబాద్‌లో.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్ దక్కనుంది? సిటీలో పార్టీని బలోపేతం చేయగల నేత కోసం అన్వేషన మొదలైందా? గ్రేటర్ టీఆర్ఎస్ సారథ్యానికి రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? గ్రేటర్ టీఆర్ఎస్ కమిటీపై ఇటీవలే చర్చ! టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణానికి ఈ నెల 2 నుంచి చురుకుగా పనులు మొదలయ్యాయి. గ్రామ, వార్డు కమీటిలతోపాటు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఈనెలలోనే పూర్తి చేయాలన్నది నేతల నిర్ణయం. ఈ క్రమంలోనే గ్రేటర్…
ప్రస్తుతం వాడవాడలో వినాయకులను పెడుతున్నారు.. గల్లీకో గణేష్ తరహాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం.. లడ్డూ వేలం వేయడం జరుగుతోంది.. గణేష్ విగ్రహాన్ని పెట్టారంటే లడ్డూ వేలం అనేది సాధారణంగా మారిపోయింది.. కానీ, ఆ లడ్డూ వేలాన్ని ఆద్యుడు మాత్రం బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి.. అయితే, కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ… ఈ తరుణంలో ఈ ఏడాది లడ్డూ వేలం ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు…
బహుజన వాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్తారన్నది మొదటి నుంచి ఆసక్తికరంగానే ఉంది. ఆయన ముందు టీఆర్ఎస్ లో చేరతారని అనుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయన విధానాలు చూసి.. ఎలాగూ బీజేపీలో చేరరు అనే అంతా భావించారు. కానీ.. ఏ పార్టీతో కలిసి నడవకుండా.. తన విధానంలోనే ముందుకు వెళ్లి.. బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. తన నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్..…
ఖైరతాబాద్‌లో భారీ గణపతి కొలువుదీరిన కారణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గణపయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వీలైనంత వరకు ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైరతాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతించడంలేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు…
తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 315 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 340 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,786 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,891కు పెరిగింది..…
మానుకోట ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. కవితపై గతంలో నమోదైన కేసును కొట్టివేసింది కోర్టు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారంటూ 2019లో కవితపై కేసు నమోదైంది.. ఈ కేసులో విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానాను గతంలో విధించింది.. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు కవిత.. అయితే, ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో…