సొంత పార్టీ నేతల నిర్ణయం ఆ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేడర్ గుర్రుగా ఉందా? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్మానం చేసేశారా? పార్టీ సంస్థాగత ఎన్నికలను బహిష్కరించడంతో.. ఎమ్మెల్యేకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందా? ఆయన ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే పైళ్లకు పార్టీ శ్రేణుల నుంచే ఎదురుగాలి? పైళ్ల శేఖర్‌రెడ్డి. భువనగిరి ఎమ్మెల్యే. ఈ అధికారపార్టీ శాసనసభ్యుడికి ఇన్నాళ్లూ ఎలా ఉన్నా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో కేడర్ నుంచి…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో…
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవు. బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుంది అని తెలిపారు. బొట్టుబిల్లలు, గోడగడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర,…
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ…
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.. ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు తేజ్‌కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యుల బృందం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ హవర్లో ట్రోమా కేర్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని.. ఈ టైంలో ఇచ్చే ట్రీట్మెంటే సాయి ధరమ్ తేజ్‌ని కాపాడుతోందన్నారు.. ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం…
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజును ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో కలకలం రేగింది.. అయితే, బాలిక పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లోనే మృతదేహమై కనిపించింది చిన్నారి.. దీంతో.. బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు.. నిందితుడు పరారీ కాగా.. వెంటనే…
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న బండి పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.. ఇవాళ సంగారెడ్డిలోని సంగుపేట నుంచి చిట్కూల్ వరకు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర కొనసాగనుంది.. ఇక, జోగిపేట్ మెయిన్ రోడ్.. హనుమాన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.. మరోవైపు, సంజయ్‌తో పాటు ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు బైక్‌లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్‌లపై హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్‌లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని, కాలర్‌బోన్ విరిగిందని పేర్కొన్నారు. ఆయన ఇంకా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని… ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పనిసరిగా కోలుకుంటారాన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అపోలో వైద్యులు. కాగా, నిన్న రాత్రి…