సీఎం చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం.. మరోవైపు, విమాన ప్రమాదం ఘటనతో.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట కూటమి ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన కార్యక్రమం కూడా…
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్ ) మండిపడ్డారు. విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది.. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు.. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు రోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు ఇన్‌ఛార్జి జిల్లాలు మార్చారు. నల్గొండ ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ బాధ్యతలు.. కరీంనగర్ ఇన్‌ఛార్జి ఉన్న ఉత్తమ్‌కి జిల్లా కేటాయింపు లేదు.. మెదక్ ఇన్‌ఛార్జి కొండా సురేఖ ప్లేస్‌లో వివేక్‌కు చోటు.. ఖమ్మం ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి ప్లేస్‌లో వాకిటి శ్రీహరికి బాధ్యతలు.. ఆదిలాబాద్ నుండి సీతక్కను నిజామాబాద్‌కి మార్పు.. నిజామాబాద్ నుండి జూపల్లికి ఆదిలాబాద్ బాధ్యతలు.. నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్.. మెదక్…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్,…
Schools Reopen : వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థుల బడిబాట ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. జూన్ 12న ఉదయం 9 గంటలకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పిల్లలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఉపాధ్యాయులు స్కూల్స్‌ను పండుగ వాతావరణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, 11,650 ప్రైవేటు పాఠశాలలు, 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 మోడల్…
Rains : తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, గురువారం నాటి వాతావరణ సూచనల ప్రకారం, కనీసం 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
అధికారం పోయాక కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి అన్నా చెల్లెళ్ళ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడ్డట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. తనకు పార్టీలో సరైన ఆదరణ లభించడంలేదని కుంగిపోయిన కవిత ఇటీవల తండ్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అందులోని అంశాలతో పాటు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా కలకలంరేపాయి. కేసీఆర్ దగ్గర కోవర్ట్‌లు ఉన్నారని, ఆయన దేవుడేగానీ... చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత లెటర్లో రాసిన అంశాలు రాజకీయంగా…
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జూన్ 14న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. నేడు సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని సిట్ ప్రశ్నించింది. చాలా ప్రశ్నలకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సమాధానాలను దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు అధికారికం, వ్యక్తిగతం అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి అయితే తెలీదు, గుర్తులేదు అంటూ…
తెలంగాణ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కి తీరుతుందని అనుకున్న వాళ్ళు ఐదుగురు. అవకాశం దక్కింది ముగ్గురికి. కానీ... ఈ ఆశించిన ఐదుగురిలో ఎవరూ ఆ ముగ్గురిలో లేరు. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వాళ్ళంతా... తాత్కాలికంగా సైలెంట్ అయ్యారా..? వాళ్ళకు ఏ పదవులు ఇచ్చి నచ్చచెప్తారంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.