తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1, 2023 నాటి డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. జూలై 1, 2023 డీఏ మరో ఆరు నెలల్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడంతో ప్రభుత్వం పై నెలకు సుమారు 2400 కోట్ల భారం పడనుంది. Also Read:Jeep…
Bars Draw : తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఈరోజు ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఈ లాటరీ ప్రక్రియ శుక్రవారం నార్సింగ్‌లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ నేతృత్వంలో నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148…
Telangana Rains : తెలంగాణలో వర్షాల హడావుడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రధానంగా దక్షిణ , పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…
Telangana Aviation Director : అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు. విమాన సాంకేతికత, భద్రతా ప్రమాణాల గురించి స్పష్టత ఇవ్వడం కోసం ఆయన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. భరత్ రెడ్డి మాటల ప్రకారం, ఒక ఇంజన్ ఆగిపోతే మరొకటి పని చేస్తుందన్న భావన సరికాదని…
MLA Kunamneni: సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Thummala: ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల కోసం కామంచికల్ రోడ్ కావాలని సత్యం కోరారు.. ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంది.
బెదిరింపు కాల్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీకి వస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి అరెస్టు చేస్తారు.. కానీ, ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీదు పండగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్.. వేరే వేరే నంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్న పోలీస్ అధికారులు అని మండిపడ్డారు.
యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక, ఈ క్రమంలో ఆలయ దేవస్థానం అధికారులు నరసింహస్వామి భక్తులకు షాక్ ఇచ్చారు. వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
Hyd Metro: హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టొ్ద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.