తెలుగు రాష్ట్రాలకు వాన గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. దీనికి గులాబ్ అని నామకరణం చేశారు. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను పలు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని…
వైద్యశాఖలో అంతా గందరగోళమే. ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు. దీనికితోడు ఇంఛార్జుల పాలన. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తిస్థాయి అధికారులు రారు. వ్యవస్థ మొత్తం డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి. కీలకమైన వైద్య విభాగంలో ఎందుకిలా జరుగుతోంది? వైద్యశాఖలో ఇంఛార్జుల పాలన..! విభజన చట్టం ప్రకారం తెలంగాణ వైద్యశాఖలో చర్యలు తీసుకోలేదు. దీంతో పరిపాలనా విభాగాలలో ఇంఛార్జుల కాలం నడుస్తోంది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ యూనివర్సిటీ వీసీ, నర్సింగ్ రిజిస్ట్రార్, నిమ్స్ డైరెక్టర్లు అనేక సంవత్సరాలుగా కుర్చీలను వదలటం…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,702 శాంపిల్స్ పరీక్షించగా.. 248 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్‌బారినపడి మృతిచెందగా.. 324 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898కు చేరగా.. రికవరీ కేసులు 6,56,285కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,912 మంది ప్రాణాలు…
జమ్మికుంట మండలం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు స్థానిక నేతలు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఇక్కడ ధర్మానికి, న్యాయానికి స్థానం ఉంటుంది. మేం ప్రశాంతంగా ఉంటాం మా జోలికి వస్తె ఊరుకోం. దౌర్జన్యం జరిగితే ముందుగా చిందవలసింది నా రక్తపు బొట్టే. కేసులు పెడితే, జైళ్లో పెడితే ముందు నన్ను పెట్టు అన్నారు. అలాగే నేను ప్రజలకు ఏమీ చెయ్యక పోతే 6 సార్లు ఎలా గెలిపించారు నన్ను అని అడిగారు.…
కొత్త పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అలా అనీ మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు.. ఆయన నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీ సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాను…
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వాఖ్యలు చేసారు. బండి సంజయ్ ది విహారాయత్రనో ఏం యాత్రనో తెలువది అని చూపిన ఆయన దానికి అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించారు. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలి అన్నారు. ఇక నేను ఎమ్మెల్యే గా…
హస్తిన పర్యటనలోఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం అయ్యారు… ఇవాళ సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే, నెల రోజుల వ్యవధిలోనే షెకావత్‌తో కేసీఆర్ భేటీ కావడం ఇది రెండోసారి.. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైన కేసీఆర్.. 5 అంశాలపై విజ్ఞానపత్రం అందజేశారు.. ఇక, ఇవాళ్టి సమావేశంలోనూ గత సమావేశంలో చర్చించిన అంశాలే మరలా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. గోదావరి…
తెలంగాణ సీఎం గొప్ప సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కారం డిమాండ్‌తో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అన్నింట్ల ముందంటివి.. వరి పండించడంలో రాష్ట్రం ముందంటివి.. ఇప్పుడూ వరి వేస్తే ఉరి అంటున్నావు ఏంటి? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్‌నేనని గుర్తుచేసుకున్న ఆయన.. ఫస్ట్ సాఫ్ట్వేర్ రెడీ చేసి ముందు సాధ్యాసాధ్యాలపై…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్‌ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. అయితే, ఈ ఎపిసోడ్ ఇవాళ్టితో ముగిసిపోయిందని.. మళ్లీ రిపీట్ కాదని ప్రకటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో సమావేశమైన వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి.. నిన్నటి వ్యవహారంపై కార్యదర్శులు ఆయనతో మాట్లాడారు.. తను వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పార్టీ నేతలకు ఏకరువు పెట్టారు.. ఇక, అనంతరం మీడియాతో…
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో…