నూతనంగా ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖ లో తీసుకున్న తరహాలోనే… ఆర్టీసీలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇక గతంలో వివాహాది వేడుకలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవాలంటే ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉండేది. దీని కారణంగా చాలా మంది వెనకడుగు వేసే వాళ్లు. అయితే.. తాజాగా ఆ డిపాజిట్ లేకుండా బస్సులను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారికంగా ట్వీట్ చేసింది. వేడుకల కోసం బస్సు కావాలనుకుంటే నేరుగా డిపో మేనేజర్ లను సంప్రదించాలని పేర్కొంది. తాజాగా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.