తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,72,489కి చేరింది. కరోనా నుంచి 6,64,759 మంది కోలుకోగా మొత్తం 3,966 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,764 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.