తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్…సంచలన నిర్ణయాలతో.. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. చిల్డ్రన్స్ డే సందర్భంగా TSRTC ఎండీ వీసీ సజ్జనార్ పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు బస్సుల్లో టికెట్ ఉండదని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఏసీ, మెట్రో డీలక్స్, ఆర్డినరీ ఇలా ఏ బస్సు అయినా ఎక్కవచ్చన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని సూచించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.