హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు..…
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినా.. ఇతర దేశాల్లో మళ్లీ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. థర్డ్ వేవ్ తప్పదా? అనే ఆందోళనకు నెలకొన్నాయి.. ఓవైపు కోవిడ్ పోయిందనే భావనతో నిబంధనలు సడలిస్తూ వస్తున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందేమోన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక, కరోనా బారినపడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 20 ఏళ్లలోపు యువతే 90,561 మంది ఉన్నారని పేర్కొంది. పదేళ్లలోపు…
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 3 నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తొలి విడత ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నవంబర్ 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలియజేశారు. నవంబర్ 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. Read Also: కొత్తిమీర…
ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ వెళ్లిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడిపేస్తున్నారు.. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుండగా.. ప్యారిస్‌లో జరగనున్న సమావేశాల్లో కేటీఆర్ బృందం పాల్గొననుంది.. ఇక, ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,392 శాంపిల్స్ పరీక్షించగా… 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్కరు కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 122 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్…
తెలంగాణ ప్రజలు మొత్తం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. ఇప్పటికే ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలకు తెరలేపారు.. వాస్తవానికి హుజురాబాద్‌లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో…
హుజురాబాద్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు వ్యవసాయంపై బ్రతుకుతారు. అందులో ఎక్కువగా వరి సాగే వుంటది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగే అవుతుంది. సర్కార్ తుగ్లక్ పాలనలా.. నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం msp ప్రకటించింది.. దాని ప్రకారం కొనాల్సిందే. తెలంగాణను రైస్ బౌల్ చేస్తామన్నారు.. కేసీఆర్. ఇప్పుడు కొనం అని చెప్పడం సిగ్గు చేటు. సిద్దిపేట కలెక్టర్…
తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్… రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లో తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు వినయ్.. ఈ ఏడా డిసెంబర్లో కొత్త పార్టీ పేరును ,…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలో బహిరంగ సభలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… పేద ప్రజలను కాపడెది ఎవరు కాల్చుక తినేది ఎవరో ప్రజలు గుర్తించాలి. ఈటల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించలేక పోయాడు. ఎన్నికలు ఆయ్యిపోగానే గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెంచుతారు బీజేపీ వాళ్ళు. బీజేపీ గెలిస్తే పెట్రోల్ ధరలు,గ్యాస్…