తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్…సంచలన నిర్ణయాలతో.. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. చిల్డ్రన్స్ డే సందర్భంగా TSRTC ఎండీ వీసీ సజ్జనార్ పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు బస్సుల్లో టికెట్ ఉండదని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఏసీ, మెట్రో…
జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ షో ప్రసారం అవుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.కోటి ఎవరూ గెలుచుకోలేదు. అయితే తొలిసారిగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రూ.కోటి గెలుచుకున్న ఘనత సాధించినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను…
నాగార్జునసాగర్- శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. బోట్ తిరిగే ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో వాటికి టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లించాలని టూరిజం శాఖను అటవీ శాఖ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బోట్ సర్వీసులు నిలివేశారు. కాగా ఈ బోట్ దాదాపు అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ప్రయాణిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ ప్యాకేజీని అధికారులు…
నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతిని పురస్కరించుకుని నేడు తెలంగాణ ఇంజినీర్స్ డేను నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కానున్నారు. Read Also: ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన రికార్డు తొలుత జలసౌధలో విశ్రాంత ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్‌రావు విగ్రహానికి…
ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లో కొంత గ్రూప్ వార్ నడిచిన విషయం తెలిసిందే. నాయకులూ రెండు గ్రూపులుగా విడిపోయి మరి విమర్శించుకున్నారు. కానీ ఇప్పుడు అంత సద్దుమణిగినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సమావేశంలో హుజరాబాద్ ఎన్నికల ఫలితం, సంబంధిత ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది అని సి.ఎల్.పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పోరాడుతాం అని తెలిపారు. 2023 ఎన్నికలకోసం “యాక్షన్ ప్లాన్” సిధ్దం…
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. దీంతో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇదే అంశంపై చర్చించేందుకు డీకే అరుణ నివాసంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల…
ఎయిమ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో మారు తప్పుడు ప్రచారం అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మొన్ననేమో ఎయిమ్స్ కి భూమి ఇవ్వలేదని ఆరోపణ చేశారు. సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాం. ఇప్పుడేమో బిల్డంగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ అంటున్నారు. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ…
మెగా హీరోలంటే నిర్మాత బండ్ల గణేష్‌కు… బండ్ల గణేష్ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మెగా అభిమానుల కోసమే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయితే శనివారం రోజు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ బండ్ల గణేష్‌ను కదిలించింది. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముంది?కవిరాజ్ అనే వ్యక్తి తన అక్క…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా ఈరోజు ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,469కి చేరింది. కరోనా నుంచి 6,65,755 మంది కోలుకోగా మొత్తం 3,973 మంది కరోనాతో…
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై టీఆర్ఎస్ కసరత్తు ఎంత వరకు వచ్చింది? పదవీకాలం ముగిసిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. కొత్తగా సీటు ఆశిస్తున్నవాళ్లు.. రెన్యువల్ కోరుతున్న వారిలోనూ OC నేతలే అధికంగా ఉన్నారు. మరి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక లెక్కల సమతూకం ఎలా? ఈ అంశంపై గులాబీ శిబిరం తేల్చుకోలేకపోతోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా? అధికార టీఆర్ఎస్లో పదవుల పండగ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన…