సోషల్ మీడియా లో దళిత ఏమ్మెల్యేల పై ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని బాల్క సుమన్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేయొద్దు అని విన్నవించారు. మా పై , మా కుటుంబం పై, మా ఆడవరిపై అసత్య పరచారం సారి కాదు. బీజేపీ ఇలాంటి నీచ పనులకు పాల్పడుతుంది. మెం కూడా చేయటం పెద్ద పని కాదు. కానీ మా విలువలు అవుతున్నాయి. సుమోటోగా కేస్ తీసుకొని…
ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్టీల ఇష్టం. బలం లేనిచోట పోటీకి ఆలోచనలో పడతాయి. ఏకగ్రీవంగా గెలిచే పార్టీలో సంబరాలే సంబరాలు. కానీ.. అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న సంబరాలు వేరే ఉన్నాయట. ఎవరో ఒకర్ని పోటీకి పెడితే.. తమ పంట పండుతుందని ప్రత్యర్థి పార్టీలను వేడుకుంటున్నారట. ఎందుకో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోరుకుంటున్నారా? తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్ట్లీ. ఏ చిన్నపాటి ఎన్నిక వచ్చినా డబ్బులు…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మధుసూదనా చారిని ఫైనల్ చేసింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో కూడిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది కేబినేట్. ఇక తెలంగాణ కేబినేట్ పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం పెట్టడమే తరువాయి. ఇవాళ మధ్యాహ్నం లోపు తెలంగాణ…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 35,659 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,74,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,978కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గురువారం నాడు ఎన్ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వారు సోదాలు జరిపారు. 2019 జూన్‌లో ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్ కేస్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఓ పౌరుడు హతమయ్యారు. 2019 జూన్‌లో జరిగిన…
తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ రౌడీ సినిమాలోని ఓ సీన్ గురించి రేవంత్ వివరించారు. ఆ సినిమాలో విలన్ మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని… తమకు టార్గెట్‌గా ఉన్నవారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్, బీజేపీ…
రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం నాడు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలకు దిగిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ మహాధర్నా అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర సబ్జెక్ట్ లేదని ఆయన ఆరోపించారు. ఆయన మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడని… అందుకే ధర్నాలు, రాస్తారోకోలు, ప్రొటెస్టులు అంటూ ఏదేదో చేస్తున్నాడని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ దెబ్బకు కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. Read Also: అందుకే…
MLC పదవి పేరు చెబితే ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉలిక్కి పడుతున్నారా? తమ నియోజకవర్గాల్లో ఎవరికీ ఆ పదవి ఇవ్వొద్దని ఓ రేంజ్లో మంతనాలు సాగిస్తున్నారా? ఎమ్మెల్సీ పదవంటే ఎందుకు హడలిపోతున్నారు? ఏంటా జిల్లా? తమ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా ఎమ్మెల్యేల ఎత్తుగడ..! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పది. అన్నిచోట్లా ప్రస్తుతం ఒక్కటే చర్చ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నిక గురించే హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. స్థానిక…
కేంద్ర బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే… బీజేపీ పార్టీ ఆఫీసుపై పారబోస్తామని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా? ఒక్కటే మాట సాఫ్ సీదా చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు.. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలుకు విషయాన్ని అర్థం చేసుకునే ఇంకిత జ్ఞానం కేంద్రానికి…
భారత రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుంది.. బీజేపీని వదలం.. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతామని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. వడ్ల కోసం పోరాటం మొదలు పెట్టినం, దేశం కోసం కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు, కానీ మోటార్లకు మీటర్లు పెట్టాలట అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. గోల్ మాల్ గాళ్లకు గోరి కట్టాలి.. దేశంలో జెండా ఎగరాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఉద్యమం లేపాల్సిందేనన్నారు. యాసంగిలో…