రైతు అమరవీరుల పోరాటం తోనే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు కార్పొరేట్ ల కాళ్లు మొక్కుతున్నారు అని కాంగ్రెస్ ఏమ్మెల్యే సీతక్క అన్నారు. రైతులపై సీఎం, పీఎం లకి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పూర్తిగా ధాన్యం కొనాలి అని సీతక్క పేర్కొన్నారు. ఇక మధు యాష్కీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే నల్ల చట్టాలు రద్దు అయ్యాయి.…
ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మీడియాతో మాట్లాడనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు వరి కొనుగోళ్ల అంశంపైనా కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈ ప్రెస్మీట్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్లో పలువురు మంత్రులతో కేసీఆర్ ఇప్పటికే…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వరి ధాన్యం మాత్రం కొంటామని.. అయితే ఎప్పుడు కొంటాం.. ఎంత కొంటామో తరువాత చెప్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,054 శాంపిల్స్ పరీక్షించగా… 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 173 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,318కు చేరుకోగా… రికవరీ కేసులు 6,66,682కు పెరిగాయి.. ఇక, మృతుల…
ధర్మపురి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం హర్షణీయం. రైతుల నడ్డి విరుస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ఆప్పగించేలా కేంద్రప్రభుత్వం చర్యలను సంవత్సరం క్రితమే టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి చట్టాలను వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించినప్పుడు వాటి ఫలితాలు,నష్టప్రభావం అంచనా వేయకుండా అత్యంత దారుణంగా వ్యవహిరించింది. ధీంతో 600 మంది రైతులు ప్రాణాలు వదిలారు. సంవత్సరంన్నర నుండి ఆయా…
యాసంగి పంట కొంటారా…కొనరా… సీదా అడుగుతున్నాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండేది దొడ్డు వడ్లు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదాం. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని అడిగారు. రైతు చట్టాలు రద్దు రైతుల విజయం..రైతుల పోరాటం తో కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ రైతుల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా లో చేపట్టారు. రైతులు ఆందోళనల…
బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన నిధులు, రైతుల గురించి పోరాడే పార్టీ టిఆర్ఎస్… నల్ల చట్లాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాడాం. రైతుల పట్ల పోరాడే ఒకే ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. ఇక భవిష్యత్ లో రైతుల పక్షాన నిలబడే పార్టీ టీఆర్ఎస్. నల్ల చట్టాలు వెనక్కి తీసుకురావడం శుభ…
దేవుళ్ల కంటే సమాజంలో వైద్యులకే ఎక్కువ విలువ. అందులోనూ ప్రభుత్వ డాక్టర్లు అంటే.. ఆ హోదాకు ఉండే గౌరవం ఇంకా ఎక్కువ. కానీ.. వైద్య వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో చక్కర్లు కొడుతున్నారు తెలంగాణలోని గవర్నమెంట్ డాక్టర్లు. ఎవరికి నచ్చిన రాజకీయం వాళ్లు చేస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు. విభాగ అధిపతులకు కొరకరాని కొయ్యగా ప్రభుత్వ వైద్యులు..? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం సైతం కీలకంగా వ్యవహరించింది.…