‘సురేంద్ర పురి’ కుందా సత్యనారాయణ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు.. 1938 జూన్ 15న తేదీన ఆయన జన్మించారు.. గత 3 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.. అయితే, అనారోగ్యంబారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం.. యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ సురేంద్రపురిని అభివృద్ధి చేశారు. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది.
ఇక, శివుడు, నాగదేవత భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలకు దృశ్య రూపమిచ్చి కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే… ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా 9 గుడులు కట్టినారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి కలశాలను పోలి ఉంటుంది. ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే, మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఇక్కడ పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అక్టోబర్ 2008 లో ఈ ప్రాగణానికి సందర్శకులను అనుమతించినప్పటికినీ, జనవరి 2009 వరకు మెరుగులుదిద్దుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 8, 2009 న దీనిని ప్రారంభించారు. సురేంద్రపురి.. యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలో.. హైదరాబాద్‌కు వచ్చిపోయే దారిలోనే ఉండడంతో.. పర్యాటకుల తాకిడి కూడా క్రమంగా పెరుగుతూ పోయింది.. అయితే, ఆయన నిన్న మధ్యాహ్నం 2 గంటలకు తుది శ్వాస విడిచారు.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు..
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!