ఊసరవెల్లి కేసీఆర్ను ప్రజలు గద్దె దింపాలంటూ విజయశాంతి తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించారన్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని వడ్ల ముచ్చటను మర్చిపోయేలా చేయడానికే, ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని విజయశాంతి మండిపడ్డారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ…
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది అంటూ మండిపడ్డారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీలో మంత్రిగా ఉండి రాజీనామా చేసిన మౌర్య పై ఏడేళ్ల క్రితం పెట్టిన కేసులు బీజేపీ బయటకు తీసి వేధిస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఫైర్ అయ్యారు. ఇక, ధరల నియంత్రణలో బీజేపీ ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శించిన రాఘవులు.. ఎరువుల ధరలు నియంత్రణ పై…
హైదరాబాద్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది… రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ వాతావరణం నెలకొంది.. చలి కూడా తీవ్రంగానే ఉంది.. అయితే, ఉదయం వాతావరణ మారిపోయింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇవాళ ఉదయం నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్గూడ, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇక,…
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు.. 1938 జూన్ 15న తేదీన ఆయన జన్మించారు.. గత 3 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.. అయితే, అనారోగ్యంబారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం.. యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 8 అంశాలపైనే చర్చ జరిగింది. 1)…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డెంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో 2,319 కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటి కన్నా.. దాదాపు 400 కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఈ రోజు 2,319…
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల తమతో సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేసుకోవాలని పద్మాదేవేందర్ సూచించారు. మరోవైపు వేగంగా వ్యాపించే వ్యాపించే ఒమిక్రాన్ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇంకా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. Read Also: ఊర్లకు వెళ్లే వారి కోసం బస్సు పాయింట్లను…
సంక్రాంతి సంబరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది సొంత ఊర్లకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. ఇంకా చేరుకుని వారికోసం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టీఎస్ ఆర్టీసీ వారి గమ్య స్థానాలను చేర్చేందకు బస్సు పాయింట్లను ప్రకటించింది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే బస్సులు…