అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బదులిచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు.
ఛలో విజయవాడకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. విజయవాడ పోలీసుల నిఘా నేత్రంలో వుంది. నగరానికి వచ్చే అన్ని రూట్లలో పోలీసుల పహారా కాసి ప్రభుత్వ ఉద్యోగుల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎంచుకున్నబీఆర్టీఎస్ రోడ్ లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. బీఆర్టీఎస్ రోడ్ ను పరిశీలించారు విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా.
టీటీడీ లో వందలాది పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. ఆరు రోజుల ముందు పాముకాటుకు గురైన భాస్కర్ నాయుడు. తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో నిన్న చికిత్స చేశారు వైద్యులు.
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా పలువురు క్రీడాకారులు, కోచ్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వీరితోపాటు… ఫీల్డింగ్ కోచ్ దిలీప్, సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ కి కరోనా సోకింది.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు యువభారత్ దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుకొనసాగిస్తోంది భారత్.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరింది టీమ్ఇండియా. నిర్ణీత ఓవర్ల భారత్ నిర్దేశించి 290 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చతికిలపడింది.