భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్… అసెంబ్లీ మాట్లాడిన ఆయన.. 111 జీవో పరిధిలో లక్షా 32 వేల 600 ఎకరాల భూమి ఉందని తెలిపారు.. 83 గ్రామాలు, 6 మండలాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయని వెల్లడించిన ఆయన.. జంట జలాశయాలు కలుషితం కాకుండా 111 జీవో ప్రకారం నిషేధం ఉందని.. కానీ, హైదరాబాద్‌కు ఇప్పుడు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాలు అవసరం లేదన్న ఆయన.. కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.. దీంతో.. నిపుణుల కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేయనున్నట్టు ప్రకటించారు కేసీఆర్.
Read Also: Telangana: ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త.. మళ్లీ విధుల్లోకి..
కాగా, హైదరాబాద్ సిటీకి నీటి సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను కాలుష్యం నుంచి రక్షించే ఉద్దేశంతో 10 కిలోమీటర్ల వరకు క్యాచ్‌మెంట్ ఏరియాను బఫర్ జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణాలను నిషేధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవో నం.111ను తీసుకొచ్చింది.. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో లక్షా 32 వేల ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.. ఇది సుమారు జీహెచ్‌ఎంసీ విస్తరించి ఉన్న ప్రాంతానికి సరి సమానంగా అధికారులు చెబుతున్నారు.. జీవో 111పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని గతంలో తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. సమగ్రమైన చర్చ, నిర్దిష్టమైన ప్రణాళికల మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తాజాగా ఆ జీవో ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చారు.