జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్‌పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ.. నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా…
తెలంగాణలో జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలపై సందిగ్ధత నెలకొంది… షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి (సోమవారం) నుండి జేఎన్టీయూ ఇంజినీరింగ్ పరీక్షలు జరగాల్సి ఉంది.. అయితే, ఇప్పటి వరకు విద్యార్థులకు హాల్ టికెట్స్ అందకపోవడం పెద్ద చర్చగా మారింది.. మరోవైపు, పరీక్షలు నిర్వహిస్తే ఇవ్వాల్సిన ఆన్సర్ షీట్స్ కూడా ఇప్పటి వరకు కాలేజీలకు చేరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఆయా కాలేజీల యాజమాన్యాలు. అయితే, దీనికి ఫీజుల వ్యవహారమే అడ్డుగా మారినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, కాలేజీలు కామన్…
తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. అందులోనూ ప్రభుత్వం డెవలప్ చేసి అమ్మకానికి పెడితే ఆ లే అవుట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (hmda) చేపడుతున్న ప్రీ బిడ్ మీటింగ్ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. బండ్లగూడ, బహదూర్ పల్లి, ఖమ్మం పరిధిలో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి. రాజీవ్‌స్వగృహ భూములు, టవర్స్ కొనుగోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు…
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టీఆర్ఎస్ అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే కాలే అవినీతి పరుడని, ఈసారి తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంపై మండిపడ్డారు కాలే. కుంట భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అక్రమ ఆస్తులు ఉంటే… సీబీఐ దర్యాప్తుకైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. ఇక, తాడు,…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి.. రేవంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి.. వీహెచ్ నాకు అన్న లాంటివారు.. కానీ, ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అని గుర్తుచేసిన ఆయన.. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్ ఎక్కడా…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నారాయణ పేట జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఉండటానికి ఢిల్లీ, జార్ఖండ్ వెళ్లారన్న ఆయన.. ప్లీజ్ నన్ను కలవండని బ్రతిమిలాడుకుంటున్నారు…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారు.. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంది.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్‌ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం…
గడ్డి అన్నారం – కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌ను వెంటనే తెరవాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.. అయితే, మార్కెట్లో ఉన్న సామాగ్రీ తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలని సూచించింది.. బాటసింగారంలో మార్కెట్ యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని సెప్టెంబర్ 25న మూసివేసిన విషయం తెలిసిందే కాగా.. ఒక్కసారిగా మూసివేయడంతో మార్కెట్లోనే ఫర్నిచర్, ఏసీ సామగ్రి ఉండిపోయింది.. దీంతో, వాటిని తీసుకోవడానికి…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో రాంచీలో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త పంథాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని.. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈరోజు శిబూ…