Drugs Case: లక్ష్మీపతి కోసం నార్కోటిక్స్ వింగ్ వేట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబీకులతో సంబంధాలు లేకపోవడం, తరచూ మకాం మారుస్తుండటంతో కష్టతరంగా మారిం లక్ష్మీపతి ఆచూకీ. గతంలో 2020 నవంబర్ 27న మల్కాజ్‌గిరి (ఎస్వోటీ) పోలీసులు లక్ష్మీపతిని అరెస్టు చేశారు. లక్ష్మీపతికి చెందిన పూర్తి వివరాలు, అతని ఇన్ఫార్మర్ల కు చెందిన వివరాలు కొన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు. లక్ష్మీ పతికి ఐటీ వింగ్ లో భారీ నెట్ వర్క్ వుంది. ఐటీ ఉద్యోగుల టార్గెట్ గా హాష్ ఆయిల్ విక్రయాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్ష్మీపతి కాల్ డేటా సేకరించారు పోలీసులు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
లక్ష్మీపతి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కాల్ డేటా ఆధారంగా విచారిస్తున్నారు. హాష్ ఆయిల్‌ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు నిర్దారణకు వచ్చారు. లక్ష్మీపతి బీటెక్ స్టూడెంట్. అతను ఓ పోలీసు అధికారి కొడుకుగా నిర్దారణకు వచ్చారు. అరకు నుండి విశాఖ ఏజెన్సీకి చెందిన అనేకమంది గంజాయి సరఫరాదారులతో పరిచయాలు వున్నాయి. తెలంగాణ లోని రాచకొండ, హైదరాబాద్, నల్లగొండలోనూ గంజాయి హాష్ ఆయిల్ విక్రయం జోరుగా సాగుతోంది.
అరకులో గంజాయి పెడ్లర్ నగేష్ సహాయంతో హాష్ ఆయిల్ దందా సాగిస్తున్నాడు. మీర్ పేట, బీరంగూడ కు చెందిన మోహన్‌రెడ్డి లక్ష్మీపతి కి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని దందా సాగిస్తాడని తెలుస్తోంది. అరకు విశాఖ మీదుగా లీటర్ల కొద్దీ హాష్ ఆయిల్ సరఫరా జరుగుతోంది. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఆహారం, కిరాణా సరుకులు విక్రయించే డుంజో, పోర్టర్, ఉబెర్, స్విగ్గీ వంటి యాప్స్ ద్వారా మారు పేర్లతో హాష్ ఆయిల్ విక్రయాలు సాగిస్తున్నట్టు విచారణలో తేలింది.
- Tags
- Drugs
- drugs case
- dunzo
- E commerce
- Ganjai
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!