తెలంగాణ సీఎం కేసీఆర్-గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ క్రమంగా పెరుగిపోతోందనే వార్తలు వస్తున్నాయి.. గవర్నర్ ప్రసంగంలేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంపై పలు విమర్శలు వచ్చాయి.. అయితే, ఇవాళ రాజ్‌భవన్ వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాజ్ భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు.. ఇక, వివిధ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు. పుదుద్చేరి మంత్రులు, స్పీకర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Real Estate: ఏపీలో పుంజుకున్న రియల్ ఎస్టేట్..
ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఆప్యాయంగా ఉండాలని.. కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం అంటూ వ్యాఖ్యానించారు గవర్నర్ తమిళిసై.. ఫ్రెండ్లీ గవర్నర్ రాజ్ భవన్‌లో ఉన్నారన్న ఆమె.. నేను స్ట్రాంగ్ పర్సన్‌ని, నేను ఎవరికీ లొంగనన్నారు.. ఇక, వచ్చే నెల నుండి రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. రాజ్ భవన్ లిమిటేషన్స్ నాకు తెలుసు… ఉత్ప్రేరకంగా పని చేస్తానన్న ఆమె.. నేను ఎనర్జిటిక్ పర్సన్‌ని… తెలంగాణ ప్రజల్ని ప్రేమిస్తాను.. గవర్నర్ హోదాలో నా పరిమితులు నాకు తెలుసు.. నన్ను ఎవరూ నియంత్రించలేరు.. నాకు ఎలాంటి ఇగో లేదన్నారు. మరోవైపు.. నా ఆహ్వానాన్ని గౌరవించి ఉగాది వేడుకలకు హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు గవర్నర్ తమిళిసై.