మత్తుమందులకు వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒకసారి దానికి అలవాటు పడితే అది యువతను వదలదు. ఈమధ్యకాలంలో యువత మత్తుకి బానిసలై తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో గల్లీకో ముఠా తయారై డ్రగ్స్ అమ్మేస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడ్డాడు శ్రీరామ్ అనే యువకుడు. ఇంటినే ల్యాబ్ లా మార్చాడా యువకుడు.
సూర్యాపేట జిల్లా కు చెందిన యువకుడు శ్రీరామ్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చెడు వ్యసనాలకు బానిసై మత్తు మందు తానే తయారు చేయాలని నిర్ణయించాడు. ఈజీగా మనీ సంపాదించవచ్చని భావించాడు. సామాజిక మాద్యమాల్లో, అంతర్జాలంలో వెతికిన నిందితుడు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశాడు. హిమాలయాలు, రిషికేష్ లో వెళ్ళి విదేశీ పర్యాటకుల నుంచి డిఎంటీ తయారీ విధానం నేర్చుకున్నాడు శ్రీరాం.
ఏడాది పాటు విఫలమవుతూ చివరకూ డ్రగ్ తయారు చేశాడు శ్రీరాం. తొలుత తనతో పాటు స్నేహితులపై పరీక్షించాడు శ్రీరామ్.ఒకగ్రాముతో 20 మందికి మత్తు ఇచ్చాడు. డిమాండ్ పెరగడంతో ఒక గ్రాము 8వేలకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు శ్రీరాం. నార్కోటిక్ వింగ్ పోలీసులు దాడులు చేసి శ్రీరాం ఆటకట్టించారు. నిందితుడితో పాటు దీపక్ అనే వినియోగదారుడిని అరెస్ట్ చేశారు నార్కొటిక్స్ వింగ్ అధికారులు.