హైదరాబాద్‌లో మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయాయి… మెట్రో రైలు ఎక్కితే చాలు.. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు… కోవిడ్ కంటే ముందు భారీ స్థాయిలో ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించిన.. కోవిడ్ మెట్రో ప్రయాణాన్ని దెబ్బకొట్టింది.. అయితే, మళ్లీ క్రమంగా మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నారు.. అయితే, ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం గంటకు 70 కిలో మీటర్ల వేగంతో మెట్రో రైళ్లు నడుస్తుండగా.. ఇకపై గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెట్టబోతోంది… దీనిపై ఇప్పటికే కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) నుంచి హైదరాబాద్ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
Read Also: TS: రాహుల్‌లో టి.కాంగ్రెస్ నేతల భేటీ.. నివేదికలతో హాజరుకానున్న వ్యూహకర్త సునీల్..!
మార్చి 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేగం, భద్రతపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించిన సీఎంఆర్ఎస్ అధికారులు.. సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెట్రో రైళ్ల వేగాన్ని గంటకు మరో 10 కిలో మీటర్లు పెంచుకునేందుకు కూడా అనుమతించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మెట్రో రైళ్ల వేగం పెరగబోతోంది.. దీంతో.. మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి మరింత సమయం కలిసిరాబోతోంది.. నాగోల్- రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్- ఎల్బీ నగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య 1.5 నిమిషం ఆదా అవుతుందని.. మరింత స్పీడ్‌గా కార్యాలయాలకు.. అంతే వేగంతో.. గమ్యస్థానానికి చేరుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు.
https://twitter.com/ltmhyd/status/1510202577358827528