తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. పంచాంగ పఠనం, ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశాడు కేసీఆర్ అన్నారు రేవంత్. కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు పన్ను వేసి దాన్ని ఇంత దాకా తీసుకువస్తున్నారు. డీజిల్ మీద 50 రూపాయలు పన్ను వేస్తున్నారు. కేంద్రం పన్నులు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్.. కేంద్రం మీద విమర్శ చేస్తున్నప్పుడు నువ్వెందుకు పన్నులు తగ్గించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. 25 రాష్ట్రాల్లో పన్నులు రాయితీ ఇస్తున్నప్పుడు మీరెందుకు తగ్గించరు అన్నారు. ఛత్తీస్ గడ్ లో 10 రూపాయలు..కేజ్రీవాల్ 10 రూపాయలు తగ్గించారు. వ్యాట్ తగ్గించి పేదల పై భారం తగ్గించారు. వైఎస్ హయాంలో గ్యాస్ ధర పెరిగితే… రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. పాకిస్థాన్ లో 70 రూపాయలే పెట్రోల్ అమ్ముతున్నారు. పేదలను దోపిడీ చేయడంలో కేసీఆర్, నరేంద్ర మోడీ ఒక్కరే అన్నారు రేవంత్.
పేదలను దోచుకోవడంలో ఇద్దరిదీ దొంగల కులం. రాజకీయాలకు వచ్చే సరికి నేను తెలంగాణ… మోడీ గుజరాత్ అంటారు కేసీఆర్. పేదలను దోచుకునే విధానం లో అవిభక్త కవలలు వీరిద్దరూ అని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంపకం వెనక ప్రభుత్వం వైఫల్యం వుందన్నారు. విద్యుత్ సంస్థలకు మొండి బకాయి దారు ప్రభుత్వం. ప్రగతి భవన్ కరెంట్ బిల్లు కట్టడు. ప్రభుత్వ ఆఫీసుల బిల్లులు చెల్లించరు, విద్యుత్ సంస్థలు కుప్ప కూలడానికి ప్రభుత్వమే కారణం. వ్యవసాయం కి కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు… ఇంటి కరెంట్ పెంచుతున్నారు. ప్రజలు అది గమనించండి అన్నారు రేవంత్.
రైతులను ఎనిమిదేళ్ళు వడ్లు పండించే దానికి అలవాటు చేసి…ఇప్పుడు వరి వద్దు అంటున్నారు, వరి కొనను అంటే ఎట్లా? తాగురి..ఊగురి అనే స్కీమ్ తెచ్చాడు కేసీఆర్. 2021 లో ఎఫ్ సీఐకి తెలంగాణ సివిల్ సప్లై ఎండీ లేఖ రాశారు. ఫార్ బైల్డ్ రైస్ అందించం అని చెప్పాడు. ఇప్పుడేమో… కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతుల హక్కులు కేంద్రం కి ధారాదత్తం చేశారు కేసీఆర్. ఆయన లొంగిపోయి, ఒప్పందం చేసుకున్నావు కాబట్టి పీయూష్ గోయెల్ గొంతు పెంచాడన్నారు.
నీమీద కత్తి పెడితే రైతుల హక్కులు రాసిస్తావా..? నీకు తుపాకీ పెడితే ఫామ్ హౌస్ రాసి ఇస్తావా..? సీఎం కుర్చీ ఇస్తావా..? కేసీఆర్ లేఖ రాయక పోతే పీయూష్ గోయెల్ ని చొక్కా పట్టుకుని లాగేవాళ్ళం. రాష్ట్ర ప్రభుత్వంని రాళ్లతో కొట్టి చంపాలి. కేంద్రం తో ఒప్పందం కుదుర్చుకున్నది కేసీఆర్. ఆయన కు మేము మద్దతు ఇవ్వాలి అంట. తెలంగాణ సర్కార్ ని గన్ పార్క్ దగ్గర రాళ్లతో కొట్టాలి. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలో అది చేస్తుందన్నారు.