రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడికక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు.…
వేసవి ప్రారంభానికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వినియోగంలో ఆల్‌టైమ్ రికార్డు త్వరలో నమోదుకానుందని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. దింతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణలో కరెంటు డిమాండ్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గర్లో ఉంది. గత ఏడాది మార్చి చివర్లో 13 వేల 688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను అధిగమించింది. అయితే గతేడాది మార్చి 4న అత్యధికంగా నమోదైన విద్యుత్ డిమాండ్.. ఈ ఏడు ఇప్పటికే అధికమించింది. ఈనెలాఖరులోగా…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికల గురించి ఈమధ్యే తన జోస్యం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. తాజాగా ఆయనకు కోపం వచ్చింది. సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చిన కౌంటర్లకు ఎదురు దాడికి దిగారు. ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు టీపీసీసీ చీఫ్. చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీహార్ ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన కామెంట్స్‌కి వీహెచ్, మధు యాష్కీ కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే ఐదుగురు ఐఏఎస్…
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11:45 గంటలకు చేరుకుంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ‘మనఊరు – మనబడి, మనబస్తీ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ నజరానా ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మహిళల కోసం పలు ఆఫర్లను కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్…
★ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం★ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం★ ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా నేడు నారీ శక్తి అవార్డుల ప్రదానం.. అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి అవార్డులు★ నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మహిళా దినోత్సవ…
మేషం :- వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక వలన నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ సంతానం కోసం విరివిగా ధన వ్యయం చేస్తారు. వృషభం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. కొబ్బరి, పూలు పండ్లు, చల్లనిపానియ వ్యాపారులకు లాభదాయకం. సమయానుకూలంగా మీ…
శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు…
తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇక, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని..…
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులు, అమరులను అవమానం చేసేలా ఉందని రేవంత్ ఆరోపించారు. 1200 మంది అమరులు అయితే 500 మందిని మాత్రమే గుర్తించారని.. అమరుల కుటుంబాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులను చివరి బడ్జెట్లో కూడా…