పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను…
సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించబోతున్నారు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నారు.. అందరూ తన ప్రసంగం వినాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై.. నిరుద్యోగుల్లో మొదటి నుంచి అసంతృప్తి ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేశారని… ఈ హామీ నిలబెట్టు కోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటు విపక్షాలు, అటు నిరుద్యోగులు ఆందోళనబాటలో ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్. ఇందులో మొదటి రెండింటి విషయంలో న్యాయం జరిగిందన్న…
మేషం :– ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వృషభం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా…
★ నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉ. 10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. లక్ష ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసే అవకాశం.. విద్య, పోలీస్, వైద్య శాఖల్లో భారీగా పోస్టులు★ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు★ నేడు హైదరాబాద్‌లో కేఆర్ఎంబీ సమావేశం.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో భేటీ కానున్న కృష్ణా బోర్డు ఛైర్మన్★ నేడు కాకినాడ జేఎన్టీయూ 8వ స్నాతకోత్సవం , ఆన్లైన్…
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా…
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్..…
వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం రాష్ట్రంలోని విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని కేసీఆర్ తెలిపారు.…
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం…
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దుచేసుకున్న వారికి ఏడాది గడిచినా ఇంకా డబ్బులు అందలేదు. ఇలా దాదాపు 2 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఏడాది అక్టోబర్‌లో ధరణి సేవలు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అదే నెల 28 నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం మొదట స్లాట్…