గోవా.. పేరు చెబితే బ్యాంకాక్ వెళ్ళినంత హ్యాపీగా ఫీలవుతారు యువత. నెలకు కనీసం మూడునెలలకు ఒకసారైనా గోవాకు వెళ్ళాలని యువత అనుకుంటారు. అవకాశం దొరికితే చాలు వ్యాలెట్ నిండా డబ్బులతో గోవా చెక్కేస్తారు. రెండుమూడురోజులు అక్కడే వుండి ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తారు. గోవాకు టూరిస్టులను తీసుకెళ్లేందుకు కూడ డ్రైవర్లు ఆసక్తి చూపిస్తారు. గోవాకు వెళ్లిన ఓ డ్రైవర్ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
గోవా డ్రైవ్ శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకోవడం, అతని శరీరంపై ఆపరేషన్లు చేసినట్టుగా ఆనవాళ్ళు కనిపించడంతో ఆందోళన వ్యక్తం అయింది. సినిమా ఫక్కీలో అతని అవయవాలు తీసేశారేమోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే డ్రైవర్ శ్రీనివాస్ అవయవాలు సేఫ్ గా వున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిన బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేసిన ఎమర్జెన్సీ విభాగం వైద్యులు పలు అంశాలు తెలిపారు.
శ్రీనివాస్ శరీర భాగంలో అవయవాలు బాగానే ఉన్నాయని నిమ్స్ ఆసుపత్రి సిటీ స్కాన్ రిపోర్ట్ లో తేలింది. మత్తు మందు ఇచ్చి ఎవరో అతని అవయవాలు తీసుకున్నట్లు తొలుత అనుమానించారు కుటుంబ సభ్యులు. గోవా లో శ్రీనివాస్ కు ఏదైనా ప్రమాదం జరిగి గోవాలో శస్త్రచికిత్స చేసి కుట్లు వేసి ఉంటారని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారణకు వచ్చారు. శ్రీనివాస్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
https://ntvtelugu.com/tirupati-street-fight-one-injured/
ఆలస్యంగా వెలుగు చూసిన కారు డ్రైవర్ ఘటన కలకలం రేపింది. కిడ్నీలు మాయం చేశారనే అనుమానంతో పంజాగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేశారు కుటుంబీకులు. దీంతో నిమ్స్లో చేరిన బాధితుడికి మెడికల్ టెస్టులు చేశారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన శ్రీనివాస్ 10 మందితో గోవా వెళ్లాడు. గత నెల 19వ తేదీన గోవా వెళ్లిన డ్రైవర్.. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. గోవా వెళ్ళిన వెంటనే శ్రీనివాస్ కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గోవా వెళ్లి అతని ఆచూకీ కోసం గాలించారు. శ్రీనివాస్ అదృశ్యంపై గోవాలోని అంజునా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.శ్రీనివాస్ పూర్తిగా కోలుకుంటే గానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు.