TRS Protest: ఢిల్లీ వేదికగా ధర్నాకు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించాలని, తెలంగాణలో పండే ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు, కార్యకర్తల ఇళ్ళపై నల్లజెండాలు ఎగరేసి నిరసన తెలిపారు.
Also Read
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
- ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
- KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
https://ntvtelugu.com/trs-protests-against-modi-govt-attitude/
ఏప్రిల్ 11 న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. భారీ స్టేజ్..ఎండ వేడిని తట్టుకునేలా టెంట్ ఏర్పాటుచేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దేశ రైతాంగానికి మద్దతుగా గొంతెత్తే నాయకులంటూ కేసీఆర్,కేటీఆర్ ఫ్లెక్సీలు వెలశాయి. ఢిల్లీ నిరసనలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపిలు, జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇందులో పాల్గొంటారు. ఈ ధర్నాలో పలు జాతీయ రైతు సంఘాల నేతలు,వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!