మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం..…
తెలంగాణలో వరుస ఆత్మహత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు.. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.. ప్రతిపక్ష…
నిర్మల్ జిల్లా పరిషత్ పాలన అదుపు తప్పుతోంది. నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కొరిపెల్లి విజయలక్ష్మీ బాధ్యతలు చేపట్టారు. పేరుకు పదవి ఆమెదే అయినా మొత్తం యంత్రాంగాన్ని నడిపించేది ఆమె భర్త రాంకిషన్‌రెడ్డి. జెడ్పీ సీఈవోల నుంచి మండలాల్లో పనిచేసే ఎంపీడీవోలు సైతం తన ఆదేశాల మేరకు పనిచేయాలని రాంకిషన్‌రెడ్డి హుకుం జారీ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. తనకు తెలియకుండా ఏదైనా ఫైల్ కదిలితే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.…
అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా పాటించాలి.. ఆయన స్ఫూర్తిలో మనం మన…
తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ తమిళిసై మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలు దూరం పెంచుతూ పోతున్నాయి.. ఇదే సమయంలో గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని.. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. అయితే, గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న…
నిజామాబాద్ కమలంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు, మూడు వర్గాలుగా నాయకులు.. కార్యకర్తలు విడిపోయారు. ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి కూడా. ఇందుకు హనుమాన్ శోభాయాత్రలో జరిగిన గొడవలే తీవ్రతను తెలియజేస్తున్నాయి. బీజేపీలో గొడవలు సమసి అంతా గాడిన పడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ముఖ్య నాయకులే రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి కాస్త పట్టుందని భావిస్తున్న అర్బన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ…
టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఒకటి తర్వాత.. వరుసగా జరుగుతున్న ఘటనల్లో గులాబీ నేతలకు సంబంధాలు ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన మూడు వ్యవహారాలు టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక… టీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రామాయంపేటకు చెందిన తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకోవడం… సెల్ఫీ వీడియో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ పేరు చెప్పడం… రాష్ట్రవ్యాప్తంగా దుమారం…
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలను చుట్టేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఇవాళ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.. వచ్చే నెలలో రాహుల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుండగా… అంతకు ముందు కేటీఆర్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. ఇక, కేటీఆర్ పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల్లో.. టి.పీసీసీ నేతలు వరంగల్‌లో పర్యటించి రాహుల్ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఇవాళ్టి…
★ నేడు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో పర్యటించనున్న చంద్రబాబు.. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు పాదయాత్ర.. అనంతరం రచ్చబండ కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్న బాబు ★ నేడు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCICపై కేంద్రం సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ ★ తిరుపతి: పుంగనూరు అంజుమన్ షాది మహల్లో…