యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన హంతకుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు చౌటుప్పల్ పోలీసులు. వివరాల్లోకి వెళితే…చౌటుప్పల్ (మం) తూప్రాన్ పేటలో అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న మహిళ పై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. అనంతరం విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్య చేశారు. ఈ ఘటన సంచలనం కలిగించింది.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణ నాయక్ ,లావణ్య దంపతులు బతుకు తెరువు కోసం తూప్రాన్ పేటకు వచ్చారు. ఓ కాలేజ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కృష్ణ నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఆ క్రమంలోనే ఒంటరిగా నిద్రిస్తున్న లావణ్యపై కన్నేశాడు వల్లభ పాల కంపెనీ లో మేస్త్రి పనిచేస్తూ పక్కనే నివాసం ఉండే జహీరాబాద్ గ్రామానికి చెందిన హరీష్ గౌడ్(25) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై కర్రలతో బాది కిరాతకంగా హత్య చేశాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త కృష్ణకు…ఇంటి శివారులో గడ్డివాము వద్ద లావణ్య విగత జీవిగా పడి ఉన్న దృశ్యం కంట పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో హంతకుడు హరీష్ గౌడ్ ని అరెస్టు చేసి మీడియాకు వివరాలు వెల్లడించారు చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి.
సైబర్ నేరగాడి అరెస్ట్
ఆన్ లైన్ లో ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఓ సైబర్ నేరగాన్ని అరెస్ట్ చేశారు సీసీఎస్ క్రైం పోలీసులు. మోతే అశోక్ అనే వ్యక్తి ఇందుషా అనే ఫేక్ అకౌంట్ సోషల్ మీడియాలో క్రియేట్ చేశాడు. ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి యువతను మోసం చేసేవాడు. 2020 లో జూబ్లిహిల్స్ లో ప్రవీణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లవ్ పేరుతో 45 లక్షలు దోచేశాడు. 45 లక్షలలో 2 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. మిగిలింది అన్ లైన్ గేమింగ్ లో ఆడేసాడు. ఈ మోసగాడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు.
Vishaka: కన్నతల్లి కర్కశం.. రైలు టాయ్‌లెట్‌లో అప్పుడే పుట్టిన బిడ్డ