ఆమెకు చెట్లు పెంచడం మాత్రమే తెలుసు.. ప్రకృతితో మమేకం కావడమే ఆమె జీవితం.. అందుకే ఈ దేశం ఆమెను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు, 2016లో బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్క స్థానం దక్కించుకున్నారు. అంతటి మహానుభావురాలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్…
ఇవాళ (మే 18) ప్రగతి భవన్‌కు వచ్చిన తిమ్మక్కను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా సన్మానించారు. “వృక్షమాత” తిమ్మక్క తెలంగాణ ప్రజలందరికి స్పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. మొక్కలు నాటడమంటే కార్యక్రమం కాదని.. మనల్ని, మన భవిష్యత్ తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని.. తిమ్మక్క మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం తిమ్మక్క మాట్లాడుతూ.. తెలంగాణ…
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.. దీంతో, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు చుట్టూ పరుగులు పెడుతున్నారు.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్‌లు.. సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, తాము కూడా పరీక్షలు రాస్తాం.. మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ట్రాన్స్ జెండర్స్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్లో పురుషులు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. మాకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.…
తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని మండి పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి…
కేంద్రం ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను…
నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో…
చాంద్రాయణగుట్ట నల్లవాగు శ్మశానవాటికలో అర్ధరాత్రి చోరీ జరిగింది. 30వేల నగదును శ్మశాన వాటిక కార్యాలయం నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. శ్మశాన వాటిక నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే ఓ అంత్యక్రియల కోసం శ్మశాన వాటిక నిర్వాహకులు డిపాజిట్ చేసిన 30 వేల నగదు మాయమైంది. దీంతో చంద్రయాన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నల్లవాగు స్మశాన…
సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే…
పలు జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది.…