సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగరేణి సంస్థ. 2014 సంవత్సరం జూన్ మాసం ఒకటో తేదీ నుంచి.. 2022 నెల 19వ తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి సంస్థ. ఇటీవల ఆర్ ఎల్ సి సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి సంస్థ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలు ఇస్తామని…
తెలంగాణలో మరోసారి మద్యం ధరలను పెంచేసింది ప్రభుత్వం.. ఇక, మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి.. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం ధరలను పెంచింది.. రూ.200 లోపు ఎమ్మార్పీ ఉన్న లిక్కర్ పై క్వార్టర్‌కు 20 రూపాయలు, హాఫ్‌కి 40, ఫుల్ బాటిల్‌కి 80 రూపాయలు పెరగగా.. రూ. 200 కన్నా ఎక్కువ ఎమ్మార్పీ ఉన్న లిక్కర్…
టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. నిత్యం వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5…
కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య తాజాగా, ఓ వీడియోలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 1 కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ…
నిన్నఅర్ధరాత్రి (18-మే-2022) నుంచి హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు సేవలు నిలిచిపోనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను నిలువుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు. అంతే కాదు ఫిట్నెస్, లేట్ ఫీజు…
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యంపై భారీగా ధరలను పెంచింది. బీరు, లిక్కర్ ఇలా అన్నింటిపై రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీరు బాటిల్ పై రూ.20, విస్కీ, బ్రాందీ లిక్కర్ క్వార్టర్ పై రూ. 20, ఫుల్ బాటిల్ పై రూ. 80 పెంచింది. పెరిగిన రేట్లు మే 19 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అమ్మకాలు ముగిసిన తర్వాత మద్యాన్ని సీజ్ చేసి… నిల్వలు…
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రమాదం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రోగ్రాం ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కుమార అమ్మిరేశ్ అనే డీఎస్పీ క్యాడర్ అధికారి మృతి చెందారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎల్లుండి జరగబోయే సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఇక కార్యక్రమం ఏర్పాటు పైన నివేదిక ఇవ్వడం కోసం రిహార్సల్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీఎస్పీ స్టేజి సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన డీఎస్పీని ఆస్పత్రికి తరలించగా…
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ బుక్ ను ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, ఐటీ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై జిల్లాలఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో డీజీపీ…
మనది లౌకిక రాజ్యం. మనదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జీవన విధానాలు. హిందువుల పండుగల్లో ముస్లింలు, రంజాన్ ఇఫ్తార్ విందుల్లో అన్ని మతాల వారు పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకుంటూ వుంటారు. వినాయకచవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొంటూ వుంటారు. అలాగే హిందూ మతానికి చెందినవారు మరణిస్తే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తూ వుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు కొందరు ముస్లిం యువకులు. అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె అంతిమ యాత్ర లో పాల్గొని దహన…
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. మితిమీరిన వేగం, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. 18 సంవత్సరాలలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కానీ వాహనాలు ఇవ్వద్దని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట్ లక్ష్మి అన్నారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పది చోట్ల 60 రంగులతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్…